జీతాల పెంపు కోసం అద్దె బస్సు డ్రైవర్ల సమ్మె
VSP: అద్దె బస్సు డ్రైవర్ల జీతాలు పెంచాలనే డిమాండ్‌తో విశాఖ వాల్తేరు డిపోలో జరుగుతున్న సమ్మె మంగళవారం నాటికి నాలుగో రోజుకు చేరుకుంది. చర్చలకు ఆర్టీసీ అధికారులు గానీ, బస్సు యజమానులు గానీ ముందుకు రాకపోవడంతో డ్రైవర్లు విమర్శించారు. ప్రస్తుతం ఆర్టీసీ ఆన్-కాల్ డ్రైవర్‌కు 8 గంటల డ్యూటీకి రూ.1000 చెల్లిస్తుండగా డ్రైవర్లకు అలాగే చెల్లించాలన్నారు.