స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు

వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లోని సెర్ప్ స్వయం సహాయక సంఘాలకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో నాలుగు నెలలకు సంబంధించిన బ్యాంకు లింకేజీ రుణాలు, స్త్రీనిధి ద్వారా వడ్డీలేని రుణాలు మంజూరు చేసి విడుదల చేశారు. ఈమేరకు సెర్ప్ అధికారులు ఈ నెల 12న ఉత్తర్వులు జారీ చేశారు. 36,545 సంఘాలకు గత 4 నెలలకు సంబంధించిన రూ.37.65కోట్లు విడుదలయ్యాయి.