VIDEO: తెలంగాణ చౌరస్తాలో ప్రమాదకర రోడ్లు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో రోడ్లు ప్రమాదకరంగా మారాయి. పాత బస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్‌కు వెళ్లే రహదారి గుంతలతో నిండిపోయింది. రాత్రి సమయంలో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు, వాహనదారులు అధికారులను కోరుతున్నారు.