వడదెబ్బ తగిలి వృద్ధుడి మృతి
ఖమ్మం జిల్లాలో ఎండల తీవ్రతకు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. వడదెబ్బ తగిలి వైరా మండలం విప్పలమడకకు చెందిన తేళ్లూరి సులోమాన్ (60) అనే వృద్ధుడు మృతి చెందారు. వ్యవసాయ కూలీ అయిన ఆయన రేకుల షెడ్డులో నివాసం ఉండటంతో తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ కన్నుమూశారు. జిల్లాలో వారం వ్యవధిలోనే వడదెబ్బ మరణాల సంఖ్య ఆరుకు చేరడం ఆందోళన కలిగిస్తోంది.