బీజేపీ కార్యాలయం ప్రారంభం

కర్నూలు: పట్టణంలోని ఆదోని రోడ్డులో బీజేపీ కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షుడు కనిగిరి నీలకంఠ శుక్రవారం ప్రారంభించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి పత్తికొండ అభ్యర్థి కేఈశ్యాం కుమార్‌ను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు హోసూరు బ్రహ్మయ్య, సిసి రంగన్న, కర్ణం నరేష్, దండి మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు.