పంచాయతీ ఎన్నికలకు పోలీసులు సిద్ధం
SRD: జిల్లాలో మూడు విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికలకు పోలీసులను సిద్ధం చేసినట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ ఇవాళ తెలిపారు. పోలింగ్ జరిగి కేంద్రాలను సీఐలు, ఎస్సైలు వెంటనే పరిశీలించాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. అక్రమ మద్యం, నగదు పంపిణీ జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.