నర్సాపూర్ లో పీఎం మోడీ దిష్టిబొమ్మ దగ్ధం, పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్

MDK: నీట్ అక్రమాలను నిరసిస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్ లో పీఎం మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ నిరసనలో మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై ద్వజమెత్తారు. నాయకులు రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ గుప్తా, వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.