ప్రజలకు బ్యాంకింగ్ అవగాహన కల్పించిన LDM
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని భవానిపేట్ గ్రామంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో, కెనరాబ్యాంక్ ఆధ్వర్యంలో సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్‌ఫార్మేషన్ (SST) ఆర్థికఅక్షరాస్యత కేంద్రం ద్వారా ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు నిర్వహించారు. జిల్లా LDM చంద్రశేఖర్ మాట్లాడుతూ.. 'KYC సురక్షితమైన బ్యాంకింగ్ వైపు మీ మొదటి అడుగు' అవగాహన కల్పించారు.