VIDEO: 'పైపులైన్‌కు మరమ్మతులు చేయండి'
NRPT: మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో నర్సరీ సమీపంలో బీసీ కాలనీకి వెళ్లే మంచినీటి పైపులైన్ దెబ్బతింది. ఈ సమస్యను వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. పగిలిన పైపులైన్ కారణంగా కలుషిత నీరు సరఫరా అయ్యే ప్రమాదం ఉండడంతో ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.