గొర్రెలకు మేకలకు ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ
SRPT: తుంగతుర్తి మండల పరిధిలోని సంగేం గ్రామంలో మంగళవారం గొర్రెలకు, మేకలకు ఉచిత నట్టల నివారణ మందులను సర్పంచ్ కలకోట్ల మల్లేష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గొర్రెలకు, మేకలకు ఈ నివారణ మందులు వేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటాయని, వాటి ఎదుగుదలకు ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నరేష్, ఉపసర్పంచ్ జటంగి నీలమ్మ, గోపాలమిత్ర అధ్యక్షురాలు గణి, ఉన్నారు.