రేపు జరిగే మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాయిదా

రేపు జరిగే మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాయిదా

CTR: పుంగనూరు పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యా లయ సమావేశ మందిరంలో శనివారం జరుగు సాధారణ కౌన్సిల్ సమావేశం అనివార్య కారణాలవల్ల వాయిదా వేసినట్లు మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ బాషా శుక్రవారం తెలిపారు. తిరిగి సోమవారం ఉదయం 11 గంటలకు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. సమావేశానికి కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు తప్పక హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.