VIDEO: ఉప్పొంగిన దుందుభి నది..రాకపోకలకు అంతరాయం

VIDEO: ఉప్పొంగిన దుందుభి నది..రాకపోకలకు అంతరాయం

NGKL: ఉప్పునుంతల మండలం మొల్గర గ్రామ శివారులోని దుందుభి నది ఉప్పొంగింది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో దుందుభి నది మీదుగా ఈ రోజు ఉల్పర, రంగాపూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయంగా చింతపల్లి గ్రామం మీదుగా రాకపోకలు కొనసాగించాలని అధికారులు ప్రజలకు సూచించారు.