మహిళలకు GOOD NEWS
TG: మహిళలకు చీరల పంపిణీకి తేదీ ఖరారైంది. 'ఇందిరా మహిళా శక్తి' పేరుతో ఈ కార్యక్రమాన్ని ఈనెల19న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించనున్నారు. సుమారు 1.94 లక్షల మంది మహిళలకు ఈ చీరలు అందించనున్నారు. ఈనెల 15 లోపు చీరల తయారీ పూర్తి కావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో సెర్ప్, పట్టణ ప్రాంతాల్లో మెప్మా ద్వారా చీరల పంపిణీ చేయనున్నారు.