ఆఫ్గన్‌పై పాక్ దాడులను ఖండిస్తున్నాం: భారత్

ఆఫ్గన్‌పై పాక్ దాడులను ఖండిస్తున్నాం: భారత్

ఆఫ్గనిస్థాన్‌పై పాక్‌ వైమానిక దాడులను ఐరాస భద్రతా మండలిలో భారత్ ఖండించింది. చిన్నారులు, మహిళలు, క్రికెటర్లపై దాడులు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ అన్నారు. వారికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ISIL, అల్‌ఖైదా, లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్ర సంస్థలు సరిహద్దు ఉగ్రవాదంలో పాల్గొనకుండా చేయాలన్నారు.