VIDEO: రోడ్డు ప్రమాదం .. ముగ్గురికి గాయాలు
WGL: వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీని ట్రాక్టర్ ఢీకొట్టడంతో దంపతులతో పాటు ఒక బాలుడికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకుని విచారణ చేపట్టారు.