'జెండా మోసిన కార్యకర్తను గుర్తుపెట్టుకుంటాం'
PLD: టీడీపీ జెండా మోసిన ప్రతి కార్యకర్తను గుర్తు పెట్టుకుని పనిచేస్తామని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ రావు అన్నారు. పిడుగురాళ్లలోని ఎన్టీఆర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో శుక్రవారం జరిగిన నియోజకవర్గ స్థాయి టీడీపీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. త్వరలో మండల కమిటీలు ఏర్పాటు చేస్తామని, పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు.