VIDEO: డివైడర్‌ను ఢీకొన్న కారు.. పలువురికి గాయాలు
KMM: చింతకాని మండలం నామవరం రోడ్డు వద్ద డివైడర్‌ను కారు ఢీకొన్న ఘటన శుక్రవారం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ప్రయాణికులకు గాయాలు అయినట్లు వెల్లడించారు. స్థానికులు వెంటనే వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.