బాలిక అదృశ్యం

గన్నవరం: ఆత్కూరు పోలీస్ స్టేషన్లో బాలిక అదృశ్యంపై కేసు నమోదైంది. జి.కొండూరుకు చెందిన బాలిక మార్చి 9న గన్నవరం(M) వీరపనేనిగూడెంకు వెళ్లి స్నేహితురాలి ఇంట్లో ఉంది. ఆ సమయంలో కుటుంబసమస్యకు కారణమని భావించిన స్నేహితురాలి తల్లి మందలించింది. దీంతో బాలిక రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.