పరీక్షలను త్వరలో నిర్వహిస్తాం: FATHI అధ్యక్షుడు
TG: దేవసేన, సీఎంవో అధికారులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని FATHI అధ్యక్షుడు నిమ్మటూరి రమేష్ స్పష్టం చేశారు. కొందరు తమ వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. సమ్మె కారణంగా నిలిచిపోయిన పరీక్షలను వర్సిటీ అధికారులతో మాట్లాడి త్వరలో నిర్వహిస్తామని తెలిపారు. కాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో FATHI జరిపిన చర్చలు సఫలం అయిన విషయం తెలిసిందే.