VIDEO: హోలీ వేడుకల్లో విషాదం.. నీటిగుంటలో విద్యార్థి గల్లంతు
PLD: నరసరావుపేటలోని బసికాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి ఓ విద్యార్థి గల్లంతైన ఘటన మంగళవారం జరిగింది. హోలీ వేడుకల నేపథ్యంలో నీటిగుంటలో ఈత కొట్టేందుకు 4గురు ఫ్రెండ్స్ వెళ్ళారు. అయితే కొద్దిసేపటికి ముగ్గురు స్నేహితులు ఒడ్డుకు చేరుకోగా, మరొకరు గల్లంతయ్యారు. ఆ గల్లంతైన విద్యార్థి మునిగి గ్రామానికి చెందిన గోపిగా సమాచారం. ప్రస్తుతం గోపీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.