జడ్పీ సీఈవోను సన్మానించిన అధికారులు
NRML: పదవీ విరమణకు సిద్ధమైన జడ్పీ సీఈవో గోవింద్‌ను జిల్లా అధికారులు శుక్రవారం సాయంత్రం శాలువాలతో సన్మానించి, పూలమొక్కలు అందజేశారు. ఆయన సేవలను కొనియాడుతూ భవిష్యత్తు జీవితం ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీపీవో జీవరత్నం, జిల్లా ఖజానా అధికారి సరోజతో పాటు పలువురు శాఖాధికారులు పాల్గొన్నారు.