రేపటి నుండి ఉమా కమండలేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు

కోనసీమ: ఆత్రేయపురం మండలం ర్యాలీలో వేంచేసియున్న శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి వారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు ఈనెల 8వ తేదీ నుండి 12వ తేదీ వరకూ జరుగుతాయని ఈఓ రమణ మూర్తి తెలిపారు. 8న అంకురార్పణ, ధ్వజారోహణ, స్వామీ వారి కళ్యాణం, 10న సదస్యం, 12న పూర్ణాహుతి, త్రిశూల స్నానం, పుష్పోత్సవం వంటి కార్యక్రమాలు జరుగుతాయన్నారు.