ధర్మవరంలో గుండెపోటుతో రిటైర్డ్ ఉపాధ్యాయుడి మృతి
సత్యసాయి: ధర్మవరంలో రిటైర్డ్ ఉపాధ్యాయుడు శిడ్లగట్ట హనుమంతరావు(65) గుండెపోటుతో మృతి చెందారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ధర్మవరం డివిజన్లో యూటీఎఫ్ స్థాపన, విస్తరణకు నిరంతరం కృషి చేసిన హనుమంతరావు, ఇంగ్లిష్ బోధన, క్రికెట్ ఆటలో అంపైర్‌గా పేరు పొందారు.