శాంతియుత ఎన్నికలకు సిద్ధం: సీఐ
SRPT: ఎన్నికల నియమావళి అమలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నాగారం సీఐ నాగేశ్వరరావు కోరారు. ఈరోజు సాయంత్రం నాగారం మండలం వర్థమానుకోటలో సర్కిల్ పోలీసులు కవాతు నిర్వహించారు. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని తెలిపారు. ఎన్నికల సమయంలో గొడవలు, దాడులు, విజయోత్సవ ర్యాలీలు, డీజేలు, బాణాసంచా వినియోగం నిషేధమని హెచ్చరించారు.