VIDEO: హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు: డీఎస్పీ
KRNL: ఎమ్మిగనూరు మండల పరిధిలోని కలుగొట్ల సమీపంలో డీఎస్పీ భార్గవి శుక్రవారం సాయంత్రం వాహనదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వాహనదారులు వెళ్తున్నప్పుడు హెల్మెట్ లేకుండా, మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారుడు తప్పనిసరి హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేయాలని సూచించారు.