ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తా: ఆడే గజేందర్

ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తా: ఆడే గజేందర్

ADB: సిరికొండ మండలంలోని పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ శనివారం పర్యటించారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. నీట మునిగిన ఇళ్లను సందర్శించి ధైర్యం చెప్పి, ప్రభుత్వం నుంచి సహాయం అందించే విధంగా చూస్తానని బాధితులకు భరోసా కల్పించారు.