ఒకరినొకరు టైగర్ అని పిలుచుకున్న మంత్రులు

ఒకరినొకరు టైగర్ అని పిలుచుకున్న మంత్రులు

TG: మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య మిర్యాలగూడ పర్యటనలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నిండు సభలో ఇద్దరు మంత్రులు ఒకరినొకరు టైగర్ అని పిలుచుకున్నారు. ముందుగా నల్లగొండ టైగర్ కోమటిరెడ్డి సహకారంతో జిల్లాలో అభివృద్ధి పనుల్లో వేగం పెరిగిందని ఉత్తమ్ కుమార్ ప్రస్తావించగా, నేను కాదు మీరే టైగర్ అంటూ కోమటిరెడ్డి సరదాగా మాట్లాడారు.