చలి వేంద్రాన్ని ప్రారంభించిన సీఐ, ఎస్ఐ
ELR: జీలుగుమిల్లి మండల కేంద్రంలోని హైస్కూల్ వద్ద శ్రీ జగదాంబ తల్లి ట్రాలీ ఓనర్స్ అసోసియేషన్ చలివేంద్రం ఏర్పాటు చేసింది. యూనియన్ అధ్యక్షుడు చిట్లూరి పుల్లారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఐ బి. వెంకటేశ్వరరావు, ఎస్సై వి. క్రాంతి కుమార్ పాల్గొని సభ్యులకు ఖాకీ చొక్కాలు అందజేశారు. ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.