మధ్య హిమాలయాల్లో అసాధారణ వరదలు!
గ్రీన్‌హౌస్ ఉద్గారాల వల్ల మధ్య హిమాలయ ప్రాంతాల్లో అసాధారణ వరదలు పెరగొచ్చని పరిశోధకులు హెచ్చరించారు. 2100 ఏడాదికి ఇవి 80 శాతం అధికమవుతాయని అంచనా వేశారు. ప్రతి 5-10 ఏళ్లకోసారి ఇలాంటి వరదలు సంభవిస్తాయని తెలిపారు. ముఖ్యంగా భారత్- నేపాల్‌లో జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై పెను ప్రభావాన్ని చూపుతాయని పేర్కొన్నారు.