'DSC అభ్యర్థుల వయోపరిమితి పెంచాలి'

ఎన్టీఆర్: DSC అభ్యర్థుల వయోపరిమితిని 44 నుంచి 47 ఏళ్లకు పెంచాలని మాజీ ఎమ్మెల్సీ కె. లక్ష్మణరావు డిమాండ్ చేశారు. విజయవాడలో మాట్లాడుతూ.. 16,347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారని.. వయోపరిమితి కారణంగా సుమారు 70వేల మంది తమ అర్హతను కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. డీఎస్సీ సిలబస్ ప్రిపరేషన్‌కు 90రోజుల సమయం ఇవ్వాలన్నారు.