VIDEO: ఘోరంగా కరిచిన కుక్క

VIDEO: ఘోరంగా కరిచిన కుక్క

ఢిల్లీలో ఆరేళ్ల బాలుడిపై పిట్‌బుల్ జాతి కుక్క విరుచుకుపడింది. రోడ్డుపై పడిన బాల్ తీసుకునేందుకు దేవాన్ష్ బయటకు రాగా కుక్క అతడిపై దాడి చేసింది. కొంత దూరం లాక్కెళ్లి ఘోరంగా కరిచింది. ఓ మహిళ, ఓ వ్యక్తి అడ్డుకునేందుకు ప్రయత్నించినా వదల్లేదు. ఈ దాడిలో దేవాన్ష్ కుడి చెవి ఊడిపోయింది. తలకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. కుక్క యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.