కొత్త ట్రెండ్.. క్లిక్ కొడితే కోడి ఇంటికే..!

కొత్త ట్రెండ్.. క్లిక్ కొడితే కోడి ఇంటికే..!

W.G: గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ వాతావరణం మొదలైంది. పండుగకు ముందే పందెం పుంజుల విక్రయాల్లో నూతన ఒరవడి కనిపిస్తోంది. సాంకేతికతను వినియోగించుకుంటూ విక్రయదారులు ఆన్‌లైన్ వేదికగా కోళ్లను అమ్మకానికి పెడుతున్నారు. రంగు, జాతితో పాటు వాటి జాతక వివరాలను సైతం పొందుపరుస్తుండటం విశేషం. వేల నుంచి లక్షల ధర పలుకుతున్నఈ డిజిటల్ పుంజుల అమ్మకాలు ఆసక్తికరంగా మారాయి.