ప్రభుత్వ హాస్పిటల్‌లో ఆకస్మికంగా తనిఖీలు

ప్రభుత్వ హాస్పిటల్‌లో ఆకస్మికంగా తనిఖీలు

AKP: నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ప్రాంతీయ హాస్పిటల్ కమిటీ సభ్యురాలు చింతకాయల పద్మావతి ఆకస్మికంగా సందర్శించి విస్తృతంగా తనిఖీ చేపట్టారు. హాస్పిటల్లో ప్రతి వార్డును సందర్శించి, శానిటేషన్, మరుగుదొడ్లు, వాష్ రూమ్స్ ప్రాంతాల పరిశుభ్రతను స్వయంగా పరిశీలించారు. త్రాగునీటి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. రోగులకు మంచి వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు.