ఇరాన్ కరెన్సీ ఢమాల్.. డాలర్‌కు 12 లక్షల రియాల్స్!

ఇరాన్ కరెన్సీ ఢమాల్.. డాలర్‌కు 12 లక్షల రియాల్స్!

ఇరాన్ ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలమైంది. ఆ దేశ కరెన్సీ 'రియాల్' విలువ పాతాళానికి పడిపోయింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక డాలర్ విలువ ఏకంగా 12 లక్షల రియాల్స్‌కు పతనం కావడం సంచలనం రేపుతోంది. ఈ ఆర్థిక సంక్షోభంతో ఇరాన్ ప్రజలు విలవిలలాడుతున్నారు. నిత్యావసరాల ధరలు అందనంత ఎత్తుకు చేరడంతో సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు.