VIDEO: 'ప్రైవేట్ స్థలాలు పరిశుభ్రంగా ఉంచకపోతే చర్యలు తప్పవు'
KKD: ప్రైవేట్ స్థలాలను పరిశుభ్రంగా ఉంచుకొని యజమానులపై చర్యలు తప్పవని కాకినాడ నగరపాలక సంస్థ ఇంఛార్జి కమిషనర్ ఎన్ వివి సత్యనారాయణ హెచ్చరించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేట్ స్థలాల్లో విపరీతంగా పెరిగిపోతున్న మొక్కలను, తుప్పలను ఆ స్థలాలు యజమానులే తొలగించాల్సి ఉందన్నారు. కొంతమంది ప్రైవేట్ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేసామన్నారు.