పీసీసీనీ కలిసిన జిల్లా కాంగ్రెస్ నేతలు

JN: జనగామ జిల్లా కాంగ్రెస్ నేతలు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కులగణన అంశంలో తెలంగాణ చూపిన దారి దేశానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్, దూడల సిద్ధయ్య గౌడ్ తదితరులున్నారు.