నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ నిర్వహణ
HYD: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని కిస్మత్పూర్‌లో ‘అక్షర’ పేరుతో నడుస్తున్న ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం నిబంధనలను ఉల్లంగిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తిస్థాయి అనుమతులు లేకపోయినా “ఇంటర్నేషనల్ స్కూల్” పేరుతో తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారని ఆరోపిస్తునారు. అనుమతులు లేకున్నా 10వ తరగతి నిర్వహిస్తున్నారని సమాచారం.