రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే

రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే

SKLM: సాగునీరు అందించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. బుధవారం వజ్రపు కొత్తూరు మండలం బొడ్డపాడు గ్రామం  వంశధార కాలువ వద్ద జల హారతి ఇచ్చి, సాగునీటిని విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సకాలంలో సాగునీరు అందించేందుకు కృషి చేసిన అధికారులకు కూటమి నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. తమకు సకాలంలో సాగునీరు అందడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.