టీడీపీ నుండి వైసీపీలోకి చేరికలు

టీడీపీ నుండి వైసీపీలోకి  చేరికలు

ప.గో: నరసాపురం మండలం మల్లవరం గ్రామంలోని సుమారు 50 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైసీపీలో చేరారు. వారికి నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. జగనన్న ప్రభుత్వంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి చూసి ప్రజలు పార్టీకి ఆకర్షితులవుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.