ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు

WGL: 37వ డివిజన్ పరిధిలోని ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ భోగి సువర్ణ సురేష్ అన్నారు. ఖిలా వరంగల్ తూర్పు కోట రైతు వేదిక సమీపంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్ళ చెట్లను జెసిబి సహాయంతో సోమవారం కార్పొరేటర్ తొలగింపజేశారు. వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కార్పొరేటర్ సూచించారు.