క్రమశిక్షణతో విద్యనభ్యసించాలి: డీఈవో

WNP: క్రమశిక్షణతో విద్యనభ్యసించి లక్ష్యాలను చేరుకోవాలని DEO అబ్దుల్ ఘని విద్యార్థులకు సూచించారు. గోపాల్ పేట జడ్పీ పాఠశాలలో టాలెంట్ టెస్టులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గురువారం డీఈవో బహుమతులు ప్రధానం చేశారు. విద్యార్థులు ప్రయోగాత్మకమైన విద్య నేర్చుకోవడం ద్వారా మేలు జరుగుతుందన్నారు. రూ. 40 వేలు నగదు బహుమతుల ప్రదాత పందెం సుఖేందర్ రెడ్డిని అభినందించారు.