ఆలయ నిర్మాణానికి రూ. 50,000 విరాళం
BDK: జూలూరుపాడు(మం) బేతాళపాడులో వీరభద్ర స్వామి విగ్రహా ప్రతిష్ట కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఆలయ నిర్మాణానికి రూ. 50 వేలు విరాళంగా అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.