డోర్నకల్ ప్రజలకు ఎమ్మెల్యే సూచనలు
MHBD: అధిక ఉష్ణోగ్రతలు, ఎండ తీవ్రత పెరుగుతున్న కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని డోర్నకల్ MLA డా. రాంచంద్రనాయక్ సూచించారు. ఎండ వేడిమి ఉండే సమయాల్లో వీలైనంతవరకు బయటకు రాకుండా ఉండాలని, తప్పనిసరి పరిస్థితిల్లో బయటకు వచ్చే పక్షంలో జాగ్రత్తలను తీసుకోవాలన్నారు. ఉ.10 గంటల నుంచి సా.4 గంటల వరకు వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు జాగ్రత్తగా ఉండాలన్నారు.