జిల్లాలో కొండెక్కిన చికెన్ ధరలు..!
HNK: జిల్లాలో శనివారం చికెన్ ధరలు భారీగా పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో స్కిన్‌లెస్ కేజీ రూ.340, లైవ్ రూ.210, డ్రెస్సింగ్ రూ.310 వరకు పలుకుతోంది. కోళ్ల సరఫరా తగ్గడం, డిమాండ్ పెరగడం వల్లే ఈ ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే రేట్లు అమాంతం పెరగడం సామాన్యులపై భారంగా మారింది.