సిర్పూర్ (టీ) మండలంలో చోరీ..రూ.2 లక్షల నగదు అపహారణ
ASF: సిర్పూర్ (టీ) మండలంలో శనివారం చోరీ జరిగింది. తహశీల్దార్ కార్యాలయం పక్కన ఉన్న అఫ్సర్ అహ్మద్ ఖాన్ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి సుమారు రూ.2 లక్షల నగదు అపహరించారు. పని నిమిత్తం ఊరికి వెళ్లిన బాధితుడు ఉదయం ఇంటికి చేరుకొని ఘటనను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.