వినాయక చవితి.. మెదక్ ఎస్పీ కీలక సూచనలు

వినాయక చవితి.. మెదక్ ఎస్పీ కీలక సూచనలు

MDK: గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని మెదక్ ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు సూచించారు. వినాయక విగ్రహాల ఏర్పాటు కోసం ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేయకూడదని స్పష్టం చేశారు. అలాగే మండపాలను ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలని, అందుకు సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. మండపాల వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలన్నారు.