వెంకంపేటలో వైద్య శిబిరం నిర్వహణ

వెంకంపేటలో వైద్య శిబిరం నిర్వహణ

PPM: పార్వతీపురం మండలం వెంకంపేట గ్రామంలో శుక్రవారం బందలుప్పి PHC వైద్యాధికారి డా. సిహెచ్.శంకరరావు ఆధ్వర్యంలో 104 వైద్య శిబిరాన్ని నిర్వహించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి, గర్భిణీలు, బాలింతలకు అన్ని వైద్య పరీక్షలు చేసి వారికి కావలసిన మందులు ఇచ్చి జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ సూచించారు. అలాగే జ్వరలు లక్షణాలు ఉన్నవారికి రక్త నమూనాలు సేకరించాలన్నారు.