దేవరపల్లిలో అంగన్వాడీల నిరసన..!

దేవరపల్లిలో అంగన్వాడీల నిరసన..!

E.G: విజయవాడలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అంగన్వాడీలను కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని, తక్షణమే వారిని విడుదల చేయాలని CITU దేవరపల్లి మండల కన్వీనర్ భగత్ డిమాండ్ చేశారు. మంగళవారం దేవరపల్లిలో CITU ఆధ్వర్యంలో అంగన్వాడీలు నిరసన చేపట్టారు. అంగన్వాడీల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరారు.