VIDEO: అంగన్వాడీ టీచర్లకు సెల్‌ఫోన్ల పంపిణీ
VSP: పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం ఈబోనంగి బొద్దపువానిపాలెం అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్లకు సెల్‌ఫోన్ల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. డిజిటల్ విధానంతో అంగన్వాడీ సేవలు మరింత పారదర్శకంగా, సమర్థంగా అందుతాయని ఆయన తెలిపారు.