'రైతుల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోంది'

VZM: మెంటాడ మండలం ఆండ్ర రిజర్వాయర్ నీటిని రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి ఆదివారం విడుదల చేశారు. ఖరీఫ్ అవసరాల నిమిత్తం ఈ నీటిని వదిలారు. రైతుల అభ్యున్నతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.